‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ఏఐ సాంకేతికతపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం

Spread the love

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. మేకిన్ ఇండియా, భారత ఇన్నోవేషన్ ఎబిలిటీని ఈ సమ్మిట్ చాటుతోందని స్పష్టం చేశారు.  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునః సమీక్షించేలా ఉండాలని పేర్కొన్నారు. మానవ అభివృద్ధిలో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. 

ప్రపంచంలోనే ఆరోవంతు జనాభా మన దేశంలో  ఉంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఇంట్రెస్ట్ చూపిస్తోందని తెలిపారు. భారత్ ఏఐ డెవలప్మెంట్  ఒక హిస్టరీగా నిలుస్తుంది. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పరివర్తన శక్తి ఉంది. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని  అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందని వివరించారు. మనుషులు, టెక్నాలజీ  కలిసి అభివృద్ధి పయనం సాగించే యుగంలో ఉన్నాం. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు ప్రస్తుతం ఏఐను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు క్వశ్చన్. ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్ మార్క్ అని స్పష్టం చేశారు. హ్యూమన్ సెంట్రిక్ ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలని యై మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలని ప్రధాని మోదీ వివరించారు. అలాగే ఏఐ వినియోగంలో ‘మానవ్ (MANAV) విజన్’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్ అర్థం, ఫ్రేమ్ వర్క్ ను  కూడా ఆయన వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *