ఫిబ్రవరి నుంచి భారీగా పెరగనున్న పొగాకు ఉత్పత్తుల ధరలు

Spread the love

టొబాకో (పొగాకు) ప్రొడక్ట్స్ ధరలు ఫిబ్రవరి నుంచి భారీగా పెరగనున్నాయి. వీటిపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తాజాగా నోటిఫికేషన్ వెలువడింది.  పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం, బీడీలపై 18 శాతం కేంద్రం జీఎస్టీ విధించింది. పాన్ మసాలాపై హెల్త్, జాతీయ భద్రత సెస్సు పెంపుతో పాటు, పొగాకు సంబంధిత ఉత్పత్తులకు అదనంగా ఎక్సైజ్ సుంకం వేసింది. ఇవి ఫిబ్రవరి నుంచి అమలులోకి రానున్నాయి.. తయారీ కేంద్రాల ప్రోడక్ట్ కెపాసిటీని  బట్టి సెస్ చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్సు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా రెండు బిల్లులను పార్లమెంటు గత డిసెంబర్ నెలలో ఆమోదించింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025’ బిల్లును ఉభయసభలు ఆమోదించాయి. ఈ ట్యాక్స్ ల  ద్వారా సమకూరే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు బిల్లు ఆమోదం పొందిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.