సైబర్ క్రైమ్స్ ను అరికట్టేందుకు తీసుకువచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ ను ఇప్పటివరకు 2కోట్ల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ యాప్ సాయంతో చట్టవ్యతిరేఖ, అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 1.52 కోట్ల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. మోసపూరిత సిం లతో లింకై ఉన్న 27 లక్షల వాట్సాప్ అకౌంట్లతో పాటు ఇతర డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ ఫామ్ లను కూడా బ్లాక్ చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ లను బలంగా ఎదుర్కొనే ఆయుధంలా ‘సంచార్ సాథీ’ యాప్ పనిచేస్తోందన్నారు. గతంలో విదేశీ కాలర్ల నుండి సుమారు 1.35 కోట్ల నకిలీ కాల్స్ రికార్డ్ అయ్యేవని అయితే ప్రస్తుతం దాదాపు 95 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. ఈ యాప్ తో ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాలపై నిఘా పెడుతుందనే దానిపై నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.