ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొనుగోలు చేయడంపై బీజేపీ నేత సంగీత్ సోమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న తరుణంలో ఆ దేశ ఆటగాడి కోసం షారుఖ్ ఖాన్ తొమ్మిది కోట్లు వెచ్చించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా షారుఖ్‌ను “దేశద్రోహి” అని సంబోధిస్తూ, ఇలాంటి వారికి భారత్‌లో ఉండే హక్కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లా ఆటగాళ్లు విమానాశ్రయం దాటి బయటకు రాలేరని కూడా ఆయన హెచ్చరించారు. ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బంగ్లా ఆటగాళ్లను ప్రోత్సహించవద్దని సూచించారు. అయితే, కాంగ్రెస్ నేత సురేందర్ రాజ్‌పుత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, షారుఖ్‌ను మతం ప్రాతిపదికన లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే క్రీడల్లో రాజకీయ వేడి రాజుకుంది.
బంగ్లా ఆటగాడి కొనుగోలు పై బీజేపీ నేత ఆగ్రహం…షారుఖ్‌పై ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు!