బెంగళూరులో ఓం శక్తి మాలధారుల రథయాత్రపై రాళ్ల దాడి!

Spread the love

బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ (JJR) నగర్‌లో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఆలయం నుండి ఓం శక్తి మాలధారులు వైభవంగా నిర్వహిస్తున్న రథయాత్రపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లతో దాడికి దిగారు.ఈ అవాంఛనీయ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు పలువురు భక్తులకు తలల పై తీవ్ర గాయాలయ్యాయి.ఈ దాడితో ఆగ్రహించిన భక్తులు పెద్ద ఎత్తున జేజే నగర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన చేపట్టారు.తమపై కావాలనే ఇతర మతస్తులు దాడి చేశారని,గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న వెస్ట్ డివిజన్ డీసీపీ యతీష్ ఎన్‌బీ వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో భక్తులు శాంతించారు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.