మహారాష్ట్ర మొదటి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్..ప్రధాని మోడీ విషెస్

Spread the love

మహారాష్ట్ర బారామతిలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు ఆయన సతీమణి సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబై లోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. మహారాష్ట్ర మొట్టమొదటి మహిళా డిప్యూటీ సీఎంగా ఆమె బాధ్యతలు అందుకోవడం పట్ల ఆమె పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్రా పవార్ గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ బాధ్యతను స్వీకరించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా కృషి చేస్తారని, దివంగత అజిత్ దాదా పవార్ గారి ఆశయాలను నెరవేరుస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని మోడీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.