వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది. అత్యాధునిక ఫెసిలిటీస్ , లాంగ్ జర్నీలకు సౌకర్యంగా ఉండే ఈ ట్రైన్ కోల్ కతా- గువాహటి మధ్య త్వరలో పట్టాలపై దూసుకుపోనుంది. ఇక ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఛార్జీల వివరాలు, బుకింగ్ రూల్స్ ను రైల్వే శాఖ నోటిఫై చేసింది. ఈట్రైన్ లో మినిమమ్ చార్జి రూ.960 నుంచి మొదలవుతుంది. మ్యాగ్జిమమ్ 3,500 కిలోమీటర్లకు 1ఏసీ ఛార్జీ రూ.13,300గా నిర్ణయించారు. కిలోమీటర్ వారీగా చూసినప్పుడు (మినిమమ్ టికెట్ ప్రైస్) 3. ఏసీకి కిలోమీటరుకు రూ.2.4 చొప్పున రూ.960, 2 ఏసికి కిలోమీటరుకు రూ.3,1 చొప్పున రూ.1240, 1 ఏసీకి కిలోమీటరుకు రూ.3.8 చొప్పున రూ.1,520 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి టికెట్ ధరలు పెరుగుతాయి. వందేభారత్ స్లీపర్ రైలులో టికెట్ కన్ఫర్మ్ అయిన వారికే ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్ఎసీకి ఇందులో చోటులేదు. అంటే వెయిటింగ్ లిస్ట్, పార్షియల్ గా కన్ఫామ్ అయిన ప్యాసింజర్ లకు ఈ ట్రైన్ లో ప్రయాణానికి అనుమతించరు, ఆడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ నుంచే (60 రోజుల ముందు నుంచి) అన్ని బెర్తులూ అందుబాటులో ఉంటాయి. ఇందులో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. ఇతర కోటాలకు ఆస్కారం లేదు. డిజిటల్ రూపంలోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టికెట్లను క్యాన్సిల్ చేసినప్పుడు 24 గంటల్లో రిఫండ్ చేస్తారు. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్ల అందుబాటును బట్టి లోయర్ బెర్తులను సిస్టమ్ ఆటోమేటిక్ గా కేటాయిస్తుంది. దాదాపుగా ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని వసతులు ఉండనున్నాయి.