దేశంలో రోజురోజుకు పునరుత్పాదక వనరుల వినియోగం పెరుగుతోంది. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా రూపపుర గ్రామం పూర్తిస్థాయిలో సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటూ రికార్డు సృష్టించింది. గ్రామంలోని 90 శాతం ఇల్లు, పొలాల వద్ద సోలార్ ప్యానెల్స్ ఉంటున్నాయి. గ్రామస్థులు వారు పూర్తిగా వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వానికి విక్రయిస్తుండడంతో ఒక్కో కుటుంబానికి రూ.5000 నుండి రూ.7000 వరకు ప్రతి ఏటా ప్రభుత్వం జమ చేస్తోంది. విద్యుత్ అధికారులు గ్రామ సభలు పెట్టి ప్రోత్సహిస్తుండడంతో స్థానికులు ఒక్కొక్కరుగా సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారు. సోలార్ సిస్టమ్ కు అయ్యే ఖర్చులో ప్రభుత్వం రాయితీ కూడా ఇవ్వడం కూడా ప్రజల్లో ఆసక్తి కలిగేందుకు కారణమైంది. రూపపురాను మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. గతంలో ఇదే గుజరాత్‌లోని మోధేరా గ్రామం భారతదేశపు మొట్టమొదటి 24×7 సోలార్ విలేజ్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు రూపపుర వంటి గ్రామాలు కూడా అదే బాటలో పయనిస్తూ గ్రామీణ భారతం గ్రీన్ ఎనర్జీ వైపు ఎలా మళ్లుతోందో నిరూపిస్తున్నాయి.