పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్ ను మాల్డా నుంచి జెండా ఊపి ప్రారంభించారు. దానికి ముందు ట్రైన్ లోపలకి వెళ్లి అందులోని సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. అందులోని విద్యార్థులతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ లోని నుంచి అస్సాం లోని గువాహటిల మధ్య దేశంలోనే మొదటిదైన వందే భారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్ రాకపోకలు సాగించనుంది. ఇక ఈ ట్రైన్ లో అద్భుతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఏసీ స్లీపర్ బెర్త్ లు, అడ్వాన్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్, సీసీటీవీ నిఘా వంటి ఏర్పాట్లున్నాయి. ప్రయాణికులకు మంచి సౌకర్యాన్నిచ్చే విధంగా విలాసవంతంగా తీర్చిదిద్దారు. మాల్దా నుండి భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కనెక్టివిటీని పెంచడానికి అనేక అమృత్ భారత్ రైలు సేవలను కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.