మన కళలు, మన సంస్కృతి – ఇవే మన అసలైన సంపద:డిప్యూటీ సీఎం పవన్

Spread the love

తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ రెండో రోజు  పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్యకళారూపాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ మహోత్సవంలో పాల్గొన్న 17 సంప్రదాయ కళాబృందాల కళాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. మన కళలు, మన సంస్కృతి – ఇవే మన అసలైన సంపద. ఇలాంటి కళారూపాలను కాపాడటం, ప్రోత్సహించడం మన అందరి బాధ్యత.ఇక సంక్రాంతి సందర్భంగా కళాకారుల  కుటుంబ సభ్యులకు, సహచర కళాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.