కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకు గుడ్ న్యూస్ చెప్పారు. గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, క్రీడా అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌కు ఖేలో ఇండియా పథకం కింద రూ.14 కోట్లకు ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. ఈ నిధులతో స్టేడియంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన మల్టీ-స్పోర్ట్స్ వసతులు ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. క్రీడల్లో గుంటూరును ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, క్రీడా శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలియజేశారు.