అల్ట్రా మోడ్రన్ లుక్ లో రుక్మిణీ..’టాక్సిక్’ నుంచి న్యూ పోస్టర్

Spread the love

కె.జి.ఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న యశ్ హీరోగా మలయాళ డైరెక్టర్  గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ఉన్నట్లు టీమ్ ప్రకటించింది. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్  విడుదల చేసింది. మోడ్రన్ లుక్ లో  రుక్మిణి కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల లుక్ ను విడుదల చేశారు. ఇప్పుడు రుక్మిణి కూడా అందులో ఉన్నట్లు అధికారికంగా వెల్లడైంది.  దీంతో ఇందులో నలుగురు హీరోయిన్స్ అయ్యారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ ఎలిజబెత్, నయనతార గంగ పాత్రలో సందడి చేయనున్నారు.  భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది.