తమిళనాడు, బెంగాల్‌లో ఎన్డీయేదే గెలుపు:కేంద్రమంత్రి అమిత్ షా 

Spread the love

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు  పుదుకోట్టై జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రతి పనికి 20 శాతం కమీషన్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.ఉపాధ్యాయులు, నర్సులు, అంగన్‌వాడీ కార్యకర్తలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారంటేనే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.మహిళా భద్రత విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.అదే సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం తమిళ భాషా సంస్కృతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అమిత్ షా పునరుద్ఘాటించారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే అవినీతి పాలనకు చరమగీతం పాడటం ఖాయమని ఆయన పేర్కొన్నారు.