ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ చుట్టూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది.సనాతన ధర్మం , హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.సినీ నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ..అన్వేష్ తన వీడియోల ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.విశాఖపట్టణానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉంటూ వీడియోలు చేస్తున్నారు.కాగా, ఇదే అంశంపై ఇప్పటికే ఖమ్మం జిల్లా ఖానాపురంహవేలి పోలీస్ స్టేషన్‌లో కూడా ఆయనపై కేసు నమోదైంది.సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.చాలా మంది ఆయన ఛానల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తూ, వీడియోలను రిపోర్ట్ చేస్తున్నారు.మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.