పంజాబ్ కు వరుసగా 5వ పరాజయం..ముంబై ఇండియన్స్ గెలుపు

Spread the love

ఈ ఐపీఎల్ సీజన్ లో మొదట వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ సూపర్ కింగ్స్ తరువాత వరుసగా 5 పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 57 (32; 6×4, 4×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. అజమాతుల్లా ఒమర్జాయ్ 38 (17; 2×4, 4×6), ప్రియాన్ష్ ఆర్య (22), కూపర్ కనోలి (21), జేవియర్ బ్రెట్లెట్ (18 నాటౌట్), విష్ణు వినోద్ (15 నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు,  కోర్బిన్ బాష్ 1 వికెట్, రాజ్ బవా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రికెల్టన్ 48 (23; 4×4, 4×6), రోహిత్ శర్మ 25 (26; 2×6) శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ అవుటైన అనంతరం  తిలక్ వర్మ 75 నాటౌట్ (33; 6×4, 6×6) ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. నమన్ ధీర్ (9), షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ (20),  విల్ జాక్స్ 25 నాటౌట్ (10; 2×4, 2×6) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అజమాతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు, మార్కో జాన్సెన్, యుజువేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు ప్రస్తుతం 12 మ్యాచ్ లు ఆడి 13 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ కోసం చెన్నై, హైదరాబాద్,రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ల మధ్య పోటీ నెలకొంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *