శ్రీలంకలో ట్రై యాంగిల్ సిరిస్ కోసం భారత ఏ జట్టు ఎంపిక

Spread the love

ట్రై యాంగిల్ సిరిస్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. జూన్ 9 నుండి మొదలవుతున్న ఈ సిరీస్ లో ఆఫ్ఘనిస్థాన్, భారత్, శ్రీలంక ‘ఏ’ జట్లు పాల్గొననున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్షన్ బృందం టీమ్ ను ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. యంగ్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ టీమ్ లోకి చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ ట్రై సిరీస్ లో ప్రతి టీమ్ మిగిలిన రెండు టీమ్ లతో రెండు మ్యాచ్ లు చొప్పున ఆడనుంది. టాప్ 2 లో ఉన్న టీమ్ లు ఫైనల్ ఆడనున్నాయి. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ ట్రై సిరీస్ పూర్తైన తరువాత ఇండియా ఏ, శ్రీలంక ఏ టీమ్ లు మల్టీ డే మ్యాచ్ లు ఆడనున్నాయి. 

ఎంపిక చేసిన జట్టు (ఏ):

తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బడోని, నిశాంత్ సింధు, హార్ష్ దూబే, సూర్యన్ష్ షెడ్గే, ప్రభ్ సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యద్విర్ సింగ్, అన్షూల్ కాంబోజ్,  

అర్షద్ ఖాన్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *