2027 వరల్డ్ కప్ మెగాటోర్నీ ఫార్మాట్ పై చిన్న దేశాల నుండి విమర్శలు

Spread the love

వన్డే క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ విధానంలో ఐసీసీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. టెక్నికల్ గా 14 టీమ్ లు రేసులో ఉన్నప్పటికీ అందులో పోటీపడేది 12 మాత్రమే. మొదటి 11 టీమ్ లతో పాటు మిగతా మూడింటిలో ఒకటి మాత్రమే ప్రధాన  .ఇక ఇప్పటికే నెదర్లాండ్స్, స్కాట్లాండ్ ల నుండి ఐసీసీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ వేసిన ఈ అడుగును వెనుకడుగుగా అభివర్ణించాడు. ఐసీసీ టోర్నీలో 14 నుండి 12కు తగ్గించడం ఎందుకని ప్రశ్నించాడు. ఫిఫా వరల్డ్ కప్ ను ఉదహరిస్తూ అందులో టీమ్ లను 32 నుండి 48 వరకు విస్తరించారని అయితే క్రికెట్ లో మాత్రం తగ్గించుకుంటూ పోతున్నాం అంటూ అసహనం వ్యక్తం చేశాడు. క్రికెట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటే టీమ్ ల సంఖ్య పెంచాలి కానీ తగ్గించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. టోర్నీ పరిమాణాన్ని తగ్గించడం వల్ల చిన్న  దేశాలకు ప్రపంచకప్ వేదికపై ఆడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని ఇటువంటి ప్రపంచ వేదికలపై ఆడితేనే చిన్న దేశాల్లో క్రికెట్ మరింతగా విస్తరించి అభివృద్ధి చెందుతుందని అలా కాకుండా ఇలా చేయడం వలన చిన్న దేశాలను నిరుత్సాహపరుస్తుందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న దేశాలకు ఇది మింగుడు పడడం లేదు. ఐసీసీ సంకుచితంగా వ్యవహరిస్తోందని ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ వంటి వారు విమర్శిస్తున్నారు. 4 జట్లు అర్హత సాధించినప్పటికీ చివరి మూడు స్థానాల్లో అంటే 12, 13, 14 నిలిచిన జట్లు మెయిన్ టోర్నీకి ముందు ఒక ప్రైమరీ క్వాలిఫైయింగ్ (సూపర్ సిరీస్) ఆడాల్సి ఉంటుంది. అందులో గెలిచిన ఒక్క జట్టు మాత్రమే మెయిన్ టోర్నీ గ్రూప్ స్టేజ్ కు వెళ్తుంది. దీంతో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి జట్లు మెయిన్ టోర్నీ చేరడానికి మూడు రకాల క్వాలిఫైయింగ్ టోర్నీలు ఆడాల్సి వస్తుందని, ఇది అత్యంత దారుణమైన ఫార్మాట్ అని క్రీడా విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. స్కాట్లాండ్, డచ్ క్రికెట్ బోర్డులు ఈ విధానంపై అధికారికంగా తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇక 2027లో జరిగే ప్రపంచకప్ 14వ మెగా టోర్నీ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *