ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్..

Spread the love

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో స్టార్ షూటర్ మను బాకర్ కొద్దిలో గోల్డ్ మెడల్ కోల్పోయింది. రెండో స్థానంలో  నిలిచి సిల్వర్ సాధించింది. వియాత్నంకు చెందిన నుయెన్ ట్రాంగ్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో  మను, ట్రాంగ్ ల మధ్య గట్టి పోటీ జరిగింది. ఇద్దరూ 35 పాయింట్లతో సమానంగా నిలిచారు. షూటాప్లో నుయెన్ పైచేయి సాధించింది. ఇక హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ బ్రాన్జ్ మెడల్ తో ఆకట్టుకుంది. తాజాగా జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగం ఫైనల్ లో ఇషా 30 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. మను, ఇషా, సాంగ్వాన్ టీమ్  (1751) టీమ్ విభాగంలో గోల్డ్ తో సత్తా చాటింది. చైనీస్ తైపీ (1735), వియత్నాం (1729) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.