భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అతడు తన పని తేలిక చేస్తున్నాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఈ ఫార్మాట్లో నా పనిని సూర్య ఎంతో సులభం చేశాడు. అతనొక అసామాన్యమైన కెప్టెన్. ఇది కేవలం మైదానంలో జరిగే విషయాలు, లేదంటే బ్యాటర్గా తన ఆటను బట్టి చెప్పట్లేదని అవన్నీ పక్కన పెడితే.. ఆటగాళ్లతో అతను రిలేషన్, మాట్లాడే తీరు వారితో సమయం గడుపు మైదానంలో ప్రశాంతంగా ఉండటం ఇవన్నీ ఎంతో బాగుంటాయన్నాడు. అతను జట్టు వాతావరణం చక్కగా ఉండేలా చూసుకుంటాడు కాబట్టి కోచ్ గా మనం వేరే విషయాలు ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుందన్నాడు. సూర్యకు ఒక ఆటగాడిగా కంటే కెప్టెన్ గా ఎక్కువ మార్కులు వేస్తానని పేర్కొన్నాడు. ఒక మంచి కెప్టెన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలూ తనకున్నాయి. అతను ఒత్తిడిలోనూ బెస్ట్ నిర్ణయాలే తీసుకుంటాడని గంభీర్ కొనియాడాడు.