ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం 118 ర్యాంకింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 102 పాయింట్లతో సౌతాఫ్రికా 4వ స్థానంలో, 95 పాయింట్లతో పాకిస్తాన్ 5వ స్థానంలో ఉన్నాయి.
ఇక తదుపరి వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది 2027లో జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ వన్డే ప్రపంచ కప్ కు సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 14 జట్లు పాల్గొననున్నాయి. ఇక ఈ ఫార్మాట్ 2003 తరహాలో రెండు గ్రూపులుగా విభజించనున్నారు. సూపర్ సిక్స్ ఫార్మాట్‌తో జరగనుంది. మొత్తం 54 మ్యాచ్‌లు జరగనుండగా, 7 జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ దశలో 14 జట్లను ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా (Group A, Group B) విభజిస్తారు. ప్రతి జట్టు తన గ్రూపులోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గెలిచి రెండు గ్రూప్ ల నుండి టాప్ 3లో ఉన్న టీమ్ లు సూపర్ సిక్స్ కు అర్హత సాధించనున్నాయి. సూపర్ సిక్స్ పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఆపై విజేతగా నిలిచిన జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి.