టీ 20 ర్యాంకింగ్స్ టాప్ 10లోకి వచ్చేసిన సూర్య..నెంబర్ వన్ గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ 

Spread the love

తాజాగా విడుదలైన టీ 20 ర్యాంకింగ్స్ లో భారత టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి టాప్ 10లోకి వచ్చేశాడు. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో రాణిస్తున్న సూర్య ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 717 పాయింట్లతో 7వ ర్యాంక్ చేరుకున్నాడు. గత రెండు మ్యాచ్ లలో 37 బాల్స్ లోనే 82 పరుగులు అలాగే తర్వాతి మ్యాచ్ లో 26 బాల్స్ తో 57 పరుగులతో సత్తా చాటాడు. త్వరలో టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్య ఫామ్ లోకి రావడం భారత జట్టుకు మరింత జోష్ ఇస్తుంది. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 929 పాయింట్లతో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 35 బాల్స్ లో 84 పరుగులు అలాగే మూడో టీ 20లో 14 బాల్స్ లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 849 పాయింట్లతో రెండో స్థానంలో, భారత బ్యాటర్ తిలక్ వర్మ 781 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. బుమ్రా 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల లిస్ట్ లో హార్దిక్ పాండ్య మూడో స్థానంలో, శివమ్ దూబే 11వ స్థానంలో, అక్షర్ పటేల్ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీమ్ లలో భారత్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది.