తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో హస్తం హవా

Spread the love

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఫలితాలలో కనబడుతోంది. నేరేడు చర్ల, హుజూర్నగర్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, రామాయంపేట, హుజూరాబాద్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, చెన్నూరు, మంథని, హుస్నాబాద్, సుల్తానాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ ఘన్పూర్, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, ములుగు, యాదిగిరి గుట్ట, ఆలేరులలో కాంగ్రెస్ దూసుకుపోతోంది.  అయిజ, తొర్రూర్, ఇబ్రహీంపట్నం, గడ్డపోతారం, ఇంద్రేశం,తిరుమలగిరి, ఆమనల్, సిరిసిల్లలో బీ.ఆర్.ఎస్ ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి ఫలితాల కోసం మరికొంత సమయం పడుతోంది.