‘సేవా తీర్థ’ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

Spread the love

ప్రధాని మోడీ నేడు ప్రధానమంత్రి కార్యాలయం నూతన  భవనం ‘సేవా తీర్థ’ ను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఇకనుంచి ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న బిల్డింగ్ నుంచే ప్రధాని మోడీ  కార్యకలాపాలు కొనసాగించనున్నారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా ప్రధాని కార్యాలయం కొత్త భవనంలోకి మారడం గమనార్హం. ‘సేవా తీర్థ’ తోపాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1, 2 లను ప్రధాని మోడీ అఫీషియల్ గా ప్రారంభించారు. ప్రస్తుతమున్న పలు మంత్రిత్వ శాఖ బిల్డింగ్స్, ఆఫీసులు పాతవి కావడంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వసతులతో కొత్త భవనాల నిర్మాణం జరిగింది. ఇప్పటివరకు వేర్వేరు చోట్ల ఉన్న పీఎంఓ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీస్, కేబినెట్ సెక్రటేరియట్లను ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి మార్చనున్నారు. 1931 ఫిబ్రవరి 13న న్యూఢిల్లీని భారత రాజధానిగా అధికారికంగా ప్రారంభించారు. సరిగ్గా 95 ఏళ్ల తర్వాత అదే రోజున (ఫిబ్రవరి 13, 2026) ఈ కొత్త పాలనా కేంద్రం ప్రారంభం కావడం విశేషం. ఇక ‘సేవా తీర్థ’లో పేదలు, అణగారిన వర్గాలు, మన కష్టపడే రైతులు, యువశక్తి మరియు నారీ శక్తి సాధికారతకు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు.