“అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ప్రతీ నిముషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా అన్నారు.  రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోందన్న ఆయన ట్రాఫిక్ వ్యవస్థ ఆరో వేలు మాదిరిగా తయారైందని  ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని  సంపూర్ణ సంస్కరణలతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.