ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఘనంగా నారావారిపల్లెలో సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు మంత్రి లోకేశ్, నారా బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వేడుకలను ప్రారంభించారు. ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. ఆయా పోటీలను సీఎం, కుటుంబసభ్యులు ఆసక్తిగా వీక్షించారు. సంబరాలకు ముందు కూడా సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.నేడు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూడు రోజులపాటు స్వగ్రామంలోనే చంద్రబాబు గడపనున్నారు.