తెలంగాణాలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇటీవల బీ.ఆర్.ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా బీ.ఆర్.ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్ల వయసు దృష్ట్యా పీఎస్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ పేర్కొంది. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని సూచించింది.