మహదేవప్ప కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పరామర్శ

Spread the love

మక్తల్ పట్టణంలో ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి బీజేపీ తెలంగాణ తరపున రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. 

ఇక నేడు తెలంగాణ మున్సిపల్ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డి కీలక పోస్ట్ చేశారు. ఓటరు మహాశయులకు నమస్కారం. మీ అందరికి తెలుసు, గత 12 ఏళ్ల  బీఆర్ఎస్,  కాంగ్రెస్  పాలనలో  రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధి ఏరకంగా కుంటుపడిందో మనమంతా చూశాం.  ఇవాళ మున్సిపాలిటీలు కనీసం వీధి లైట్ లకు నోచుకోని దుస్థితికి తీసుకొచ్చారు. ఏదొక సమస్యతో ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపూ ప్రజా ధనాన్ని  కొల్లగొట్టడం, మజ్లిస్- మైనార్టీ ఓట్ల మీద ద్యాసే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఏకోశాన లేదు.రాష్ట్రంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించండి. పార్టీ అభ్యర్థులను గెలిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నప్రధాని మోడీ నాయకత్వానికి అండగా నిలవాలని తన పోస్ట్ లో పేర్కొన్నారు..