‘ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ నలుమూలల మన దేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని, నైతిక విలువలను గర్వంగా ప్రతిబింబిస్తున్న ప్రవాస భారతీయులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఒక సందేశంలో పేర్కొన్నారు.వివిధ దేశాల్లో నివసిస్తూ, అక్కడి సమాజాల్లో తమ ప్రతిభ, కృషి, నిబద్ధతలతో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తూ దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భాష, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాల ద్వారా భారతీయతను సజీవంగా ఉంచుతూ, తరతరాలకు మన సాంస్కృతిక విలువలను అందిస్తున్నారని అభినందించారు. సాంకేతిక విజ్ఞానం, విద్య, వ్యాపారం, వైద్యం, పరిశోధన, కళలు వంటి అనేక రంగాల్లో ప్రవాస భారతీయుల కృషి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు. భారతీయ మూలాలను మరచిపోకుండా నిలబెట్టుకుంటున్న ప్రవాస భారతీయులలోని ఆత్మవిశ్వాసం, దేశభక్తి నిజంగా ఆదర్శప్రాయమని వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ పాత్ర కీలకమైనదని, తెలంగాణ రైజింగ్ కార్యాచరణలోనూ NRI ల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.