ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల రూపాయలతో ఈ రోజు IIIT కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. పాలమూరు చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఈ శుభ కార్యక్రమం తర్వాత విద్యార్థులతో సీఎం రేవంత్ కొద్దిసేపు మాట్లాడారు. పాలమూరు జిల్లా దశాబ్దాలుగా వెనకబడి ఉండటానికి విద్య అవకాశాలు లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడమే కారణమని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆ తప్పులు దిద్దుకుని, పాలమూరులో అభివృద్ధిని పరుగులు పెట్టించి, దేశానికే ఆదర్శంగా ఈ జిల్లాను నిలుపే అవకాశం వచ్చిందని విద్య, సాగునీటి రంగాల్లో పాలమూరును దేశానికే ఆదర్శంగా నిలబెడతామని స్పష్టం చేశారు. ఏడాది లో ఐఐఐటీ భవనం సిద్ధం చేస్తామన్నారు.