మన దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ప్రాంతంలోని టెంపుల్స్ వద్ద దాడులకు తెగబడేందుకు పాక్ కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు తెలిపాయి. దీని కోసం భారీ మొత్తంలో పేలుడు పదార్దాలు వాడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో అలెర్ట్ ఐన భద్రతా సంస్థలు ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించాయి. సెన్సిటివ్ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాయి. బాంబ్ స్క్వాడ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గత సంవత్సరం రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడి నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు అన్ని ప్రముఖ నగరాల్లో భద్రత పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.