డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం  సమీక్షించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కే విజయానంద్ ఆర్థిక, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన, పోర్టులు, ఆర్ అండ్ బి శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.