అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం:మంత్రి నారా లోకేష్

Spread the love

కాకినాడ జేఎన్టీయూలో “హలో లోకేష్ ” కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేఎన్టీయూ ఈసిఇ 3వ సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి సంధానకర్తగా వ్యవహరించారు. ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. బూరుగుపూడిలో రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గం వడిశలేరులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, సూరంపాలెం వద్ద ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు.

కాకినాడ జేఎన్టీయూలో నందనం పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. జేఎన్టీయూ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ఇన్నోవేషన్ ఫెయిర్” లో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతగా కోరమాండల్ సంస్థ కాకినాడ రూరల్ వలసపాకల బీచ్ రోడ్డులో నిర్వహిస్తున్న కోరమాండల్ ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద  కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధిష్టానమని చెప్పారు. అభివృద్ధి- సంక్షేమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని, ప్రభుత్వంపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.