ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు…సభ నుండి వైసీపీ వాకౌట్ 

Spread the love

నేడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా,  అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశంపై   వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.  ఏపీ అసెంబ్లీ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు. కుప్పకూలిన శాంతి భద్రత పైన నిలదీయనివ్వరు అంటూ జగన్ ప్లకార్డుతో నిరసన తెలిపారు.