ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9 నుండి 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. మార్చి 7 వరకు ఈ సమావేశాలు నిర్వహించాలని అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15,16 సెలవు కాగా, 17,18 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. 18న ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. ఫిబ్రవరి 24,25,26 తేదీలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. మార్చి 1 సెలవు ఉండనున్నాయి. ఇక మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద 8 రోజులు చర్చ జరగనుంది. 6 ఆర్డినెన్స్ లకు సభ ఆమోదం తెలపనుంది.