తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు ‘తెలంగాణ’ . తమ పార్టీ పేరులో ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేటకే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు.హైదరాబాద్ లోని జాగృతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.