అమరావతి క్వాంటం వ్యాలీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ అండ్ క్వాంటం’ (Centre of Excellence for AI and Quantum) ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కంప్యూటింగ్ కేంద్రం (UNICC) చేతులు కలిపాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా అమరావతి ‘డిజిటల్ ఎంబసీ ఫర్ సెక్యూర్ ఏఐ’గా అవతరించనుందన్నారు. ఇది ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా, అత్యంత సురక్షితమైన మరియు సార్వభౌమత్వంతో కూడిన ఏఐ (AI) వినియోగానికి వేదికగా నిలుస్తుందని ఈ సహకారం అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను మరియు గ్లోబల్ పార్ట్నర్షిప్లను రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా, ఏఐ మరియు క్వాంటం రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) పై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా UNICC డైరెక్టర్ సమీర్ చౌహాన్, ఏఐ హబ్ చీఫ్ అనూష దండపాణిలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమై చర్చించారు.