రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నాదే కాదు ప్రజలందరిదీ కూడా:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ‘ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తున్నామని, వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛరథం వస్తుందని వివరించారు.  స్వచ్ఛరథాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు. 2025 జనవరిలో ప్రారంభించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోందన్నారు.  డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. పచ్చదనం, పరిశుభ్రం, నీరు-మీరు, ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు నిర్వహించాం. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే వీధులను, రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనం అంతా తీసుకుందామని పిలుపునిచ్చారు. పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 

రాష్ట్రంలో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామన్నారు. మొదటి తారీఖునే పేదల సేవలో పేరిట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేశారు.  కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేనంత సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. ఇక వైసీపీ పైన విమర్శలు గుప్పించారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారు. పరిశ్రమల్ని తరిమేశారు.ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పునర్నిర్మాణం మొదలు పెట్టాం.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండేలా వేగంగా పనులు చేశాం. కొత్త రోడ్లను కూడా నిర్మిస్తున్నాం.శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిట్టే పార్టీ రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు.  రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదే కాదు ప్రజలందరిదీ కూడా అని స్పష్టం చేశారు. చెడును నిరాకరించే పరిస్థితి ప్రజల్లోనూ రావాలి. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందన్నారు. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వర స్వామి ఫోటోను కూడా శాసన మండలిలోకి తీసుకువెళ్లి రాజకీయం చేశారన్నారు. చెప్పులు వేసుకుని, వేంకటేశ్వరస్వామి ఫోటోను విసిరివేస్తారా.? ఎందుకు వాళ్లకింత అహంకారం?రాష్ట్రంలో కొదరు చెత్త రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *