పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:మంత్రి అచ్చెన్నాయుడు

Spread the love

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  ​ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆదివారం పేటలో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ​అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు నేరుగా అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గౌరవప్రదమైన రీతిలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ​ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నిరంతరం ప్రజల  సేవలో సంక్షేమ, అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.