రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో సాధించింది. కీలక ప్రగతి సూచికలలో రాష్ట్రంలో టాప్ ర్యాంక్ సాధించి ముందంజలో నిలిచింది. కాగా, దీనిపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రజాసేవే పరమావధిగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి నేను చేస్తున్న కృషికి గుర్తింపుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి సూచికలో మన నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం దక్కడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాజకీయ ప్రమేయాలు, అవినీతి, చందాలు, దందాలు లేని పారదర్శక పాలనతో… అధికారులు, ప్రజలు మరియు కార్యకర్తల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఈ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని మరింత ప్రగతి పథంలో తీసుకెళ్లి, అభివృద్ధిలో రాష్ట్రానికే దిక్సూచిగా నిలుపుతానని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.