క్రికెట్ లెజెండ్ సచిన్ ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు  ఎయిర్ పోర్టులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు లాంజ్ లో ఆయన పార్టీ ఎంపీలతో వివిధ అంశాలపై చర్చించారు. మరోవైపు, అదే సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎయిర్ పోర్టులో చంద్రబాబు ఉన్నారనే విషయం తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి మర్యాద పూర్వకంగా మాట్లాడారు. ఇద్దరూ కాసేపు ఆప్యాయంగా సంభాషించుకున్నారు. అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసమైన ఢిల్లీలోని 1-జన్ పథ్ కు వెళ్లారు. సచిన్ ముంబైకి బయల్దేరారు. చంద్రబాబును కలిసిన విషయాన్ని సచిన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి అని సచిన్ పేర్కొన్నారు. నిన్న రాత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశా. చంద్రబాబు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.