స్వదేశీ డ్రోన్ తయారీని ప్రోత్సహించడం మా వ్యూహాత్మక లక్ష్యం

Spread the love

ప్రధాని నరేంద్రమోడీ  మేక్ ఇన్ ఇండియా మిషన్ దేశాన్ని గ్లోబల్ సప్లై చైన్‌లలో కీలక కేంద్రంగా నిలపడంతో పాటు అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద డ్రోన్ మార్కెట్‌గా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో, స్వదేశీ డ్రోన్ తయారీని ప్రోత్సహించడం మా వ్యూహాత్మక లక్ష్యమని స్పష్టం చేసారు.  పరిశ్రమ వర్గాల సూచనల ఆధారంగా దేశంలో డ్రోన్ల R&D మరియు విడిభాగాల తయారీ పురోగతిని ఈరోజు సమీక్షించారు. స్వదేశీ డ్రోన్ సాంకేతికతలకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను సులభతరం చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి చేపట్టాల్సిన చర్యలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.