పురాతన వస్తువుల విభజనకు ఏపీ నుంచి  8 మందితో కమిటీ

Spread the love

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయ  తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త  కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించనున్నారు. ఈ మేరకు 8 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువుల గుర్తింపు, ఎంపిక, పర్యవేక్షణ, పంపిణీ చేయనుంది. అలాగే ఏపీకి చెందిన పురాతన వస్తువులను రాష్ట్రానికి బదిలీ చేసి మ్యూజియాల్లో భద్రపరిచే చర్యలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టాలని పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌కు ఆదేశాలు ఇస్తూ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వీ పొడపాటిని నియమితులయ్యారు.