పాపులేషన్ మేనేజ్మెంట్, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ‘సంజీవని’ ద్వారా జులై నాటికీ 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలనీ అధికారులను ఆదేశించారు. కేర్ అండ్ గ్రో ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం, పెరుగుదల వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. తల్లి,బిడ్డలకు పౌష్టికాహారంతో పాటు సప్లిమెంట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ లో పోషకాహారం అందేలా చూడాలన్నారు. నార్మల్ డెలివరీలు పెరిగేలా, సిజేరియన్లు తగ్గేలా చూడాలన్నారు. 60 సంవత్సరాలు దాటితే ఏ పని చేయలేమనే సైకాలజీని ప్రజల్లో మార్చాలన్నారు. ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ సిస్టమ్ తో జూన్ నాటికీ సమగ్ర కార్డులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేస్తామని అన్నారు. పాపులేషన్ విషయంలో చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో అత్యుత్తమ రిజల్ట్స్ సాధించేలా 100 డేస్ యాక్షన్ ప్లాం అమలు చేయాలనీ పరీక్షలంటే స్టూడెంట్స్ కు ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.