ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని అయితే ఈ విధానం ఖచ్చితంగా మారాలని కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యతని అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలని సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమేనని స్పష్టం చేశారు.