అనిరుధ్ ఇంట్లో పెళ్లి సందడి..!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా చెన్నైకే చెందిన వారు. వీరిద్దరి కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ పరిచయమే ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది. నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అదలా ఉండగానే ఇప్పుడు చెన్నైలో పెళ్లి సందడి మొదలైపోయింది. తాజాగా అనిరుధ్ ఇంట్లో జరిగిన కొన్ని ఫ్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ వేడుకల్లో అనిరుధ్ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా పాల్గొన్నాడు. ముఖ్యంగా ఈ పెళ్లి సంబరాల్లో భాగంగా అనిరుధ్ స్వయంగా ఒక పెద్ద డోలక్పై కూర్చొని నవ్వుతూ, తన స్టైల్ లో ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన సంగీతంతో థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించే అనిరుధ్.. ఇప్పుడు తన సొంత ఇంట్లో జరుగుతున్న వేడుకల్లోనూ అదే జోష్ చూపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను బట్టి చూస్తుంటే పెళ్లి పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని అర్థమవుతోంది.
ఇక ఈ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ పెళ్లి ఎక్కడ చేసుకోబోతున్నారనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ ను ఫాలో అవుతూ, వీరు కూడా విదేశాల్లో ఏడడుగులు వేయాలని డిసైడ్ అయ్యారు. ఈ జంట వివాహం అందమైన ద్వీప దేశమైన గ్రీస్ లో అత్యంత వైభవంగా జరగనుందంటూ సన్నిహిత వర్గాల నుంచి బలమైన ప్రచారం సాగుతోంది. నవంబర్ 10 , 11 తేదీల్లో ఈ వివాహ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. గ్రీస్ లోని ఒక లగ్జరీ రిసార్ట్ లో కేవలం రెండు కుటుంబాలకు చెందిన ముఖ్య సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. పెళ్లి తర్వాత అక్కడే కొన్ని రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయనున్నట్లు సమాచారం. విదేశాల్లో పెళ్లి పూర్తయిన తర్వాత, నవంబర్ 21వ తేదీన చెన్నైలో ఒక కనీవినీ ఎరుగని రీతిలో భారీ రిసెప్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రిసెప్షన్ కి ప్రధానమంత్రి మోదీ, తమిళనాడు సీఎం విజయ్, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ రిసెప్షన్ కు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, విజయ్ లాంటి టాప్ స్టార్స్, అలాగే రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, బిజినెస్ టైకూన్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలానే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ వెళ్లే అవకాశముంది. ఇక కావ్యా మారన్ సన్ రైజర్స్ ఓనర్ కావడంతో క్రికెట్ ప్రపంచం నుంచి పాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ లాంటి ఎంతోమంది ఆటగాళ్లు కూడా ఈ ఈవెంట్ కు వస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు అనిరుధ్-కావ్య పెళ్లి కార్డ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. వీటి కోసం లక్షల రూపాయల ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.



