సమంత లేటెస్ట్ వీడియో వైరల్.. సామ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటున్న ఫ్యాన్స్

దశాబ్దానికి పైగా అగ్రతారగా కొనసాగుతూ తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటి సమంత. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అనారోగ్యాన్ని సైతం జయించి మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె. ఈ ఏడాది మా ఇంటి బంగారం సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ హిట్ సంతోషంలో ఉండగానే, తాను తల్లి కాబోతున్నాననే మరో అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత నిండు గర్భిణీ. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో నడవడానికి కూడా కష్టపడిన సమంత, తన విల్ పవర్ తో కోలుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమెకు ఉన్న పరిచయం ప్రేమగా మారింది . ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మొదలైన వీరి ప్రయాణం గతేడాది పెళ్లి పీటల వరకు వెళ్ళింది. డిసెంబర్ 2025లో కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరు నెలల్లోనే అభిమానులతో తాను గర్భవతిని అన్న శుభవార్తను పంచుకుని అందరినీ ఆనందంలో ముంచెత్తింది. అప్పటినుంచి ఆమె ప్రతి కదలిక, ఆమె ప్రెగ్నెన్సీ గ్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన సందర్భంగా పోస్ట్ చేసిన ఒక జిమ్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మన సమాజంలో ఒక మహిళ గర్భంతో ఉందంటే, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎక్కువ బరువులు ఎత్తకూడదని, మెట్లు ఎక్కకూడదని, కేవలం ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని పెద్దలు, కొన్నిసార్లు డాక్టర్లు కూడా సలహా ఇస్తుంటారు. కానీ సమంత రూటు ఎప్పుడూ సెపరేటే కదా. ఫిట్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే సమంత.. తన ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా వర్కౌట్స్ కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు.తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తాను జిమ్‌లో చేసిన వర్కౌట్స్ తాలూకు జర్నీని ఒక సింగిల్ వీడియోగా షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత తన బేబీ బంప్ తో, నిండు గర్భిణీగా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెయిటెడ్ స్క్వాట్స్ , కోర్ స్ట్రెంథెనింగ్ లాంటి కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించింది. జిమ్‌లో ట్రైనర్ పర్యవేక్షణలో ఆమె ఎంత శ్రద్ధగా, ఎంత డెడికేటెడ్ గా ఆ వర్కౌట్స్ చేసిందో ఈ వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జిమ్‌లో చెమటోడ్చుతున్న ఈ వీడియోకు సమంత 9 The Final Lap అని ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు ఇది శరీరాన్ని కష్టపెట్టడం గురించి కాదు, శరీరం చెప్పేది వినడం గురించి అంటూ గర్భంతో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌పై తాను పెట్టిన శ్రద్ధను, మైండ్ కంట్రోల్ ను ఆ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. సరైన వైద్యుల సలహాలు, ట్రైనర్ల పర్యవేక్షణ ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో చేసే వ్యాయామాలు నార్మల్ డెలివరీకి, తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆమె పరోక్షంగా తెలియజేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తూ వైరల్ గా మారింది. కడుపుతో ఉండి కూడా సామ్ ఈ రేంజ్ లో బరువులు ఎత్తుతుంటే, అభిమానులంతా ఆమె డెడికేషన్ కు సెల్యూట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి కృతి కర్బంద లాంటి చాలామంది సినీ ప్రముఖులు ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తూ సమంతకు, ఆమె కుటుంబానికి తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇటీవలే కొన్ని వారాల క్రితం కోయంబత్తూర్‌లోని సద్గురు ఈషా ఫౌండేషన్లోనే సమంత సీమంతం వేడుకలు కూడా అత్యంత సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.



