అనిరుధ్ రిసెప్షన్ కు ధనుష్ వెళ్తారా? అభిమానుల్లో ఉత్కంఠ

అనిరుధ్ రవిచందర్ నేడు దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడి . కానీ, ఆ ప్రయాణానికి బలమైన పునాది పడింది మాత్రం 2012లో విడుదలైన త్రీ సినిమాతోనే. ఆ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ అనే పాటతోనే అనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే అనిరుధ్ సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధనుష్, అనిరుధ్ కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. వేలై ఇల్లా పట్టధారి, మారి, తంగమగన్ ఈ వరుస విజయాలతో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, మ్యూజికల్ మ్యాజిక్ చూసి అభిమానులు ముద్దుగా వీళ్ల కాంబినేషన్‌కు డీఎన్ఏ అనే ప్రత్యేకమైన పేరు కూడా పెట్టుకున్నారు. అలాంటి హిట్ కాంబో మధ్య దూరం పెరిగిందన్న వార్తలు రావడం, ఇప్పుడు 15 ఏళ్ల సంబరంలో ధనుష్ పేరు ప్రస్తావనకు రాకపోవడం అభిమానులను కలవరపెడుతోంది.
అనిరుధ్ 15 ఏళ్ల పోస్ట్‌పై చర్చ జరుగుతున్న సరిగ్గా ఇదే సమయంలో, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి తుపానులా వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఏం చెప్పారంటే.. అనిరుధ్ సినీ రంగ ప్రవేశం పూర్తిగా ధనుష్ వల్లే సాధ్యమైందని ఆమె స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు అనిరుధ్ తల్లిదండ్రులు అతడిని ఉన్నత చదువుల కోసం సింగపూర్ పంపించాలని భావించారట. సరిగ్గా ఆ సమయంలోనే అనిరుధ్ లోని అద్భుతమైన సంగీత ప్రతిభను ధనుష్ గుర్తించారు. అతడిని చదువు కోసం విదేశాలకు పంపొద్దని, సంగీత రంగంలోకి ప్రోత్సహించాలని ధనుష్ నిర్ణయించారు. అంతేకాదు, స్వయంగా అనిరుధ్‌కు ఒక కీబోర్డ్ కొనిచ్చి, తన సినిమా అయిన త్రీ చిత్రానికి సంగీత దర్శకుడిగా తొలి అవకాశం కల్పించారని ఐశ్వర్య అప్పట్లో గుర్తుచేశారు. ఇప్పుడు నెటిజన్లు ఆ వీడియో క్లిప్‌ను మళ్లీ షేర్ చేస్తూ.. ఒకప్పుడు అంతలా ప్రోత్సహించిన ధనుష్ పేరును 15 ఏళ్ల పోస్ట్‌లో ఎలా మర్చిపోయారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే 2012లో అనిరుధ్ స్వయంగా చేసిన ఒక పాత ట్వీట్ కూడా ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. తనను సంగీత దర్శకుడిగా నిలబెట్టిన వ్యక్తి ధనుష్ అని, ఆయనకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అప్పట్లో అనిరుధ్ ఎంతో కృతజ్ఞతతో పేర్కొన్నారు. అలా 2012లో ధనుష్‌కు రుణపడి ఉంటానని బహిరంగంగా ప్రకటించిన అనిరుధ్.. ఇప్పుడు 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ధనుష్ పేరును అసలు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే మాటల్లేవా? దూరం ఇంకా తగ్గలేదా? అన్న సందేహాలు కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక నవంబర్ 21న చెన్నైలో జరగనున్న అనిరుధ్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ కు సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. మరి ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు ధనుష్ వెళ్తారా? లేక దూరంగా ఉంటారా? అన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా నెలకొంది. ఒకవేళ ధనుష్ ఈ వేడుకకు హాజరైతే.. ఇన్నాళ్లూ వస్తున్న విభేదాల వార్తలన్నింటికీ ఒక్కసారిగా చెక్ పడుతుంది.



