క్రిప్టో మార్కెట్లో అనిశ్చితి…బిట్ కాయిన్ ధర తగ్గుదల..!

డిజిటల్ ఆస్తుల ప్రపంచం ఎప్పటికప్పుడు ఊహించని మలుపులు, తీవ్రమైన ఒడిదొడుకులతో ఇన్వెస్టర్లను పరీక్షిస్తూనే ఉంటుంది. గత ఏడాది కాలంగా రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచిన బిట్‌కాయిన్, ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గడం గమనార్హం. అధిక రాబడిని అందిస్తుందనే ఆశలతో పెట్టుబడులు పెట్టిన వారికి తాజా పరిణామాలు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ వేగంగా మారుతుండటంతో, డిజిటల్ కరెన్సీల భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవలి మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ స్థాయిలో బిట్‌కాయిన్ ధర 60 వేల డాలర్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది.ప్రపంచ డిజిటల్ కరెన్సీ మార్కెట్ ఎప్పటికప్పుడు ఊహించని మలుపులు, తీవ్రమైన ఒడిదొడుకులు మామూలే. గత ఏడాది కాలంగా రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకుతూ ఇన్వెస్టర్లలకు ఆహా అనిపించిన బిట్ కాయిన్, ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత లాభదాయకమైన పెట్టుబడి వేదికగా మారిందనుకున్న పరిస్థితుల్లో క్రిప్టో మార్కెట్లో మళ్లీ సూచీలు డౌన్ అవుతుండడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిణామాలు, ద్రవ్యోల్బణ భయాలు మరియు టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల ప్రభావం నేరుగా ఈ క్రిప్టోకరెన్సీలపై కూడా పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బిట్ కాయిన్ ధర $60,000 కంటే దిగువకు పడిపోయి ట్రేడ్ అవుతోంది. అక్టోబర్ 2025లో నమోదైన $1,26,198 ఆల్-టైమ్ హై తో ఇన్వెస్టర్లను తనవైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంత రేటు పలకడం లేదు. శుక్రవారం అమెరికా మార్కెట్ లో 6 శాతం, అలాగే ఆసియన్ మార్కెట్లో 5.7 శాతం క్షీణించి 55వేల పైచిలుకు డాలర్లకు చేరినట్లు ఇంటర్నేషనల్ గా వార్తలు వస్తున్నాయి.



