ఆ ఒక్క సీన్‌పై నెట్టింట రచ్చ…కీర్తి సురేష్ క్లారిటీ!

హీరోయిన్ కీర్తి సురేష్‌కు సంబంధించిన ఒక ప్రెస్‌మీట్ వీడియో సోషల్ మీడియాలో పెను దుమారానికి కారణమైంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు మిస్కిన్‌తో కలిసి కీర్తి సురేష్ పాల్గొన్న ఒక మీడియా సమావేశంలో జరిగిన చిన్న సంఘటనపై నెట్టింట పెద్ద రచ్చ మొదలైంది. మిస్కిన్ తన చేతిని కీర్తి మోకాలి పైభాగంలో వేయడాన్ని చూపిస్తూ, కొందరు నెటిజన్లు తప్పుడు అర్థాలు తీయడం మొదలుపెట్టారు. అయితే, సాధారణంగా ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోని కీర్తి సురేష్.. ఈసారి మాత్రం హద్దులు దాటి మాట్లాడిన ఒక నెటిజన్‌కు గట్టిగానే బదులిచ్చింది. ఇటీవల కీర్తి సురేష్, దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆసక్తికరమైన కోర్టు రూమ్ డ్రామా సత్యవాన్ సావిత్రి . ప్రవీణ్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ ప్రెస్మీట్లో కీర్తి సురేష్ నటనపై దర్శకుడు మిస్కిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా డోరతీ సినిమాలో కీర్తి కనబరిచిన నటన అద్భుతంగా ఉందని ఆయన మనస్ఫూర్తిగా కొనియాడారు. అలాంటి విభిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలంటే ఒక నటికి ఎంతో ధైర్యం ఉండాలని మిస్కిన్ అభిప్రాయపడ్డారు. కేవలం మాటలతో అభినందించడమే కాకుండా, కీర్తి సురేష్ నటనకు గుర్తుగా ఆమెకు ఒక గోల్డ్ రింగ్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, వేదికపై కీర్తిని ఆప్యాయంగా అభినందిస్తున్న సమయంలో.. మిస్కిన్ ఆమె మోకాలి పైభాగంలో చేయి వేసిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అక్కడి నుంచే సోషల్ మీడియాలో అసలు రచ్చ మొదలైంది.
మిస్కిన్ అలా చేయి వేసిన సమయంలో కీర్తి సురేష్ చాలా అసౌకర్యానికి గురైందంటూ ప్రచారం చేశారు. దీంతో ఈ వీడియోపై నెట్టింట రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా అత్యంత అభ్యంతరకరంగా, వెటకారంగా స్పందించాడు. సినిమాల్లో హీరోలతో నటించేటప్పుడు ఎలాంటి టచ్కైనా నవ్వుతూ ఉంటారు కదా.. అలాంటప్పుడు మిస్కిన్ తాకినందుకు మాత్రం ఎందుకు అలా ముఖం పెట్టారు? అని ఆ నెటిజన్ కీర్తిని ప్రశ్నించాడు. ఆ నెటిజన్ మైండ్ బ్లాంక్ అయ్యేలా కీర్తి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ముఖంలో అసౌకర్యం కనిపించిందని మీరెలా నిర్ణయించారు? అని కీర్తి సూటిగా ప్రశ్నించింది. దర్శకుడు మిస్కిన్‌తో తనకు తండ్రీకూతుళ్లలాంటి అనుబంధం ఉందనే విషయాన్ని ఆమె గుర్తుచేసింది. తమ ఇద్దరి మధ్య ఉన్న ఆ గౌరవప్రదమైన బంధం గురించి తెలుసుకోకుండా, కేవలం ఒక చిన్న వీడియో ఆధారంగా తప్పుడు అర్థాలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ఒకవేళ నేను నిజంగానే అసౌకర్యంగా ఫీల్ అయ్యానని అనుకున్నా సరే.. సినిమాల్లో నటించేటప్పుడు హీరోలు తాకుతారు కాబట్టి, బయట కూడా ఎవరైనా అలా ప్రవర్తిస్తే నేను సౌకర్యంగానే ఉండాలా? అని ఆ నెటిజన్ను నిలదీసింది. సినిమాల్లో ఒక పాత్ర కోసం నటించడం వేరు, వ్యక్తిగత జీవితంలో ఒకరి హద్దులను గౌరవించడం వేరు.. ఈ రెండూ పూర్తిగా వేర్వేరు విషయాలని పేర్కొంది. కీర్తి సురేష్ ఇచ్చిన ఈ సూటి,ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు మిస్కిన్‌తో తనకున్న తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని గౌరవిస్తూనే, ఇటు సినిమా నటనకు-నిజ జీవిత హద్దులకు మధ్య ఉన్న తేడాను కీర్తి చెప్పిన విధానంపై నెటిజన్లు, సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.



