మొన్న కె.జి.ఎఫ్, నిన్న సలార్ ఇప్పుడు డ్రాగన్!

తెలుగు అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘డ్రాగన్’ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు, పెట్టిన బడ్జెట్ లెక్కలు చూస్తుంటే మూవీ లవర్స్ కు ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోతున్నాయి. దేవర తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ గురించి ఫిలింనగర్ వర్గాల్లో ఒక బిగ్గెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ క్రేజ్, ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూకు ఏమాత్రం తగ్గకుండా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాపై కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ఖర్చు చేస్తున్నారు. హీరో, దర్శకుడి ప్రస్తుత మార్కెట్ పరిధిని దాటి మరీ భారీ బడ్జెట్‌ను రంగంలోకి దించినట్లు ట్రేడ్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. పెట్టిన బడ్జెట్ తిరిగి రావడమే కాకుండా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
డ్రాగన్ మేకర్స్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశారు. కన్నడలో కేజీఎఫ్ 1, 2, తెలుగులో సలార్ 1, 2 తో పార్ట్స్ కాన్సెప్ట్‌ను బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ కోసం రాసుకున్న ప్రపంచం చాలా విస్తృతమైనది. ఆ ఎమోషన్స్ ను, యాక్షన్ ను కేవలం మూడు గంటల్లో ముగించడం కష్టం అని ఆయన భావించారు.అందుకే డ్రాగన్ కథను రెండు భాగాలుగా విస్తరించి, అందులో మొదటి భాగాన్ని జూన్ 2027లో అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కథను ముగించే రెండో భాగాన్ని 2028లో విడుదల చేసే విధంగా ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్ షెడ్యూల్స్‌ను ఎన్టీఆర్ డేట్స్ కు అనుగుణంగా పక్కాగా సిద్ధం చేస్తున్నారు. సరైన సమయం చూసి చిత్ర యూనిట్ ఈ టూ పార్ట్స్ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఇక సినిమా ప్రొడక్షన్ విషయానికి వస్తే.. ఇటీవల గాయపడిన ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఫుల్ ఎనర్జీతో డ్రాగన్ సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక భారీ ఇండస్ట్రియల్ సెట్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు కథానాయికగా నటిస్తున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా పాన్ ఇండియా రేంజ్లో అదిరిపోయింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ విలక్షణ నటుడు బిజూ మీనన్, అలాగే అశుతోష్ రాణా, సీనియర్ నటి ఖుష్బూ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.



